హాలీవుడ్‌ నటి ఇంట లక్ష్మీదేవి పూజ

0
41

మామూలుగా విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు గుళ్లకు వెళ్లడంలాంటివి చూస్తూనే ఉంటాం. కానీ మన దేశ సంప్రదాయం గురించి, మనం ఆరాధించే దైవంగురించి అవగాహన లేని వారు తమ ఇళ్లలో పూజలు చేయడంలాంటివి జరగదు. కానీ ప్రముఖ నటి, గాయని మైలీ సైరస్‌ తన నివాసంలో లక్ష్మీదేవి పూజ నిర్వహించింది. సూపర్‌ బౌల్‌ 2017 నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మైలీ ప్రదర్శన ఇవ్వబోతోంది.షో సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటూ తన ఇంటిని పూలమాలలతో అందంగా అలంకరించి పండితులను పిలిపించి లక్ష్మీదేవికి పూజ నిర్వహించింది. లక్ష్మీదేవి ఫొటో పక్కన ఆమె ఆరాధించే కొందరు వ్యక్తుల ఫొటోలను కూడా పెట్టి మరీ పూజ చేసింది. అమ్మవారికి పూలు, పండ్లు, హల్వా నైవేద్యం కూడా పెట్టింది. ఈ ఫొటోలను మైలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. మైలీకి మన దేశంలోనూ ఎందరో అభిమానులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here