స్వైన్‌ ఫ్లూ పంజా

0
12

ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 కేసులు, 5 మరణాలు సంభవించాయి. ఇందులో అత్యధిక కేసులు, మరణాలు చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. నెల రోజుల్లో 11 కేసులు, రెండు మరణాలు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 2015లో అత్యధిక కేసులు నమోదు కావడంతో పాటు 36 మరణాలు సంభవించాయి. దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు 2016లో కేసులు, మరణాల రేటును బాగా తగ్గించగలిగారు. ఆ ఏడాదిలో 12 కేసులు, 5 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. కానీ 2017లో మళ్లీ విజృంభిస్తోంది. కొత్త ఏడాది ప్రారంభమైన నెల రోజుల్లోనే 26 కేసులు, 5 మరణాలు సంభవించాయి. తాజాగా గురువారం నమోదైన రెండు కేసులతో చిత్తూరు జిల్లాలో ఈ సంఖ్య 11కు చేరింది. ఐరాల, తిరుపతి అర్బన్‌ ప్రాంతాల్లో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు అరుణకుమారి రెండు రోజులు చిత్తూరు జిల్లాలో పర్యటించి స్వైన్‌ఫ్లూ బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. పరిస్థితులను పరిశీలించి.. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

LEAVE A REPLY