స్వర్గంలో విహరిస్తున్నట్లుంది

0
22

హాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తోంది ప్రియాంకచోప్రా. ప్రస్తుతం బేవాచ్ సినిమాతో పాటు అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో నటిస్తున్నది ఈ సుందరి. హాలీవుడ్‌లో గత కొంత కాలంగా షూటింగ్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆమె సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే ముంబయికి తిరిగివచ్చింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఇన్నాళ్లు ఇంటికి దూరంగా గడిపాను.మళ్లీ నాదైన ప్రపంచంలో అడుగుపెట్టాను. ఇళ్లు, పరిసరాలు, స్నేహితులు ఏది మారలేదు. కానీ అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. స్వర్గంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది అని తెలిపింది. అలాగే తాను బాలీవుడ్‌కు దూరం కాలేదని, త్వరలో హిందీలో తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తానని తెలిపింది. ఎంత దూరం వెళ్లినా మళ్లీ సొంతగూటికి రావాల్సిందేనని చెప్పింది. బేవాచ్ చిత్రంలో ప్రియాంక ప్రతినాయిక ఛాయాలున్న పాత్రలో నటిస్తున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమా విడుదలకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here