‘స్పైడర్‌’ టీజర్ విడుదల వాయిదా!

0
18
సూపర్‌స్టార్‌ మహేష్‌, తమిళ అగ్రదర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్‌’. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేయాలనుకున్నారు. మహేష్‌ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటన చేసింది. అయితే టీజర్ విడుదల వాయిదా పడింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి కారణంగా ‘స్పైడర్‌’ టీజర్ విడుదల వాయిదా పడింది. దాసరి నారాయణరావు మృతి కారణంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం కాకుండా, గురువారం ఉదయం 10:30 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించినంత వరకు రెండు పాటల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. వచ్చే రెండు వారాల్లో ఈ షూటింగ్‌ను పూర్తి చేసెయ్యాలని కృతనిశ్చయంతో ఉంది చిత్రయూనిట్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here