స్పెషల్ రికార్డ్ నమోదు చేసిన పార్ధివ్ పటేల్..

0
24
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న పార్ధివ్ పటేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మొదటి రోజు ఆటలో అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్‌ క్యాచ్ అందుకున్న పార్ధివ్, టెస్టుల్లో 50 మందిని ఔట్ చేసిన వాడిగా నిలిచాడు. దీంతో యాభై కన్నా ఎక్కువ మందిని ఔట్ చేసిన 8వ భారత వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కుక్‌ను ఔట్ చేసిన తర్వాత స్టోక్స్‌ను స్టంపింగ్ చేసిన పార్ధివ్ ఇప్పటి వరకు మొత్తం మీద 42 క్యాచ్‌లు అందుకుని 9 స్టంపౌట్‌లు చేశాడు. 8 సంవత్సరాల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన మొదటి భారత క్రికెటర్‌‌గా కూడా పార్ధివ్ నిలిచాడు. అయితే ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ మొదటి రోజు ఆటలో టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.
టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన టాప్ భారత వికెట్ కీపర్లు..
1) ఎమ్మెస్ ధోనీ – 294
2) సయ్యద్ కీర్మాణీ – 198
3) కిరణ్ మోర్ – 130
4) నయాన్ మోంగియా – 107
5) ఫరూక్ ఇంజినీర్ – 82
6) నరేన్ తమ్హానె – 51
7) పార్ధివ్ పటేల్ – 51
8) దినేష్ కార్తీక్ – 50

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here