స్పెయిన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపు

0
18

భారతదేశపు బలమైన ఆర్థికవ్యవస్థ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నదని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ స్పానిష్ కంపెనీలను ఆహ్వానించారు. స్పెయిన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో రెండు దేశాల ప్రతినిధివర్గాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్ సెక్యూరిటీ, పౌరవిమానయానరంగంలో సహకారం కీలకమైనవి. అంతకుముందు స్పెయిన్ అధ్యక్షుడు మరియానో రాజోయ్‌తో రాజధాని మాడ్రిడ్‌లోని మంక్లోవా ప్యాలెస్‌లో ప్రధాని మోదీ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శిక్షలకు గురైన వ్యక్తుల పరస్పర అప్పగింత, దౌత్యపాస్‌పోర్టు కలిగిన వ్యక్తులకు వీసా మినహాయింపు, అవయవ మార్పిడి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఒప్పందాలపై ఇరుపక్షాలూ సంతకాలు చేశాయి. భారత్‌లో ప్రస్తుతం రోడ్డునిర్మాణం, రైల్వేలు, పవనవిద్యుత్తు, నీటిశుద్ధి, రక్షణ, స్మార్ట్‌సిటీ రంగాల్లో 200కు పైగా స్పానిష్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి.

LEAVE A REPLY