స్టింగ్ ఆపరేషన్ వైరల్.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య

0
19

ఆర్మీ విధుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్టింగ్ ఆపరేషన్ జరిపి తీసిన వీడియో వైరల్ కావడంతో జవాన్ రాయ్ మాథ్యూ(33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో డియోలలి కంటోన్మెంట్‌లోని సేనాశిబిరం(బరాక్)లో గురువారం దుర్వాసన వస్తున్న జవాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన మాథ్యూ గత ఫిబ్రవరి 25వ తేదీ నుంచి కనిపించడంలేదని చెప్పారు. బ్రిటీష్ కాలంనాటి ఆర్డర్లీ విధానంపై మాథ్యూ స్టింగ్ ఆపరేషన్ జరిపాడు. ఆర్మీ ఉన్నతాధికారుల వద్ద జవాన్‌లు ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇది వైరల్ కావడంతో మాథ్యూపై ఉన్నతాధికారులు విచారణకు సైతం ఆదేశించారు. మానసికంగా కుంగిపోయిన మాథ్యూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బీఎస్‌ఎఫ్ జవాన్ తేజ్‌బహద్దూర్ నేను మానసికంగా కుంగిపోతున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాకు మద్దతు ఇవ్వాలి అంటూ మరో కొత్త వీడియోను పోస్టు చేశారు.a

LEAVE A REPLY