స్టార్‌మాకే ‘అర్జున్‌రెడ్డి’శాటిలైట్ రైట్స్!

0
17

అర్జున్‌రెడ్డి మూవీ శాటిలైట్ రైట్స్ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. తెలుగు రొమాంటిక్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన
ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ని స్టార్ మా దక్కించుకుంది. దాదాపు మూడుకోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సినిమా
యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటూ భారీ వసూళ్లను సాధించడంతో శాటిలైట్ రైట్స్‌ విషయంలో గట్టి పోటీ ఖాయమని
భావించారు. దాదాపు మూడు కోట్లకు తీసుకోవాలని భావించింది జీ ఛానల్.బుల్లితెరపై చాలా డైలాగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు కట్ చేస్తారని భావించి వెనుకడుగు వేసింది ఫిల్మ్‌నగర్ టాక్. ఈ నేపథ్యంలో జీ ఛానెల్ చెప్పిన రేటుకే తాము తీసుకుంటామని స్టార్ మా ముందుతో డీల్ సెట్ అయినట్టు ఇన్‌సైడ్ సమాచారం. టీవీలో ప్రసారం చేసేందుకు ‘అర్జున్‌రెడ్డి’ కొన్ని సన్నివేశాలను తొలగించడం, మరికొన్ని డైలాగ్స్‌ని మ్యూట్ చేస్తారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here