స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు బ్రేక్‌

0
28

వరుసగా రెండు రోజుల స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు మళ్లీ బ్రేక్‌ పడింది. లాభాల స్వీకరణ అమ్మకాలతో గురువారం సెన్సెక్స్‌ 191.64 పాయింట్లు నష్టపోయి 25860 పాయింట్ల వద్ద, నిఫ్టీ 67.80 పాయింట్లు నష్టపోయి 7965 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటు 39 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ‘రూపా యి మారకం రేటు పతనం, లాభాల స్వీకరణ అమ్మకాలు, పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో నడుస్తున్న రగడ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి’ అని జియోజిత పరిబాస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ రీసెర్చి హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఆపరేటర్లు నవంబర్‌ నెల డెరివేటివ్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకోవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాతో ఫారిన్‌ పోర్టుఫోలియో సంస్థ(ఎ్‌ఫపిఐ)లు గురువారం కూడా అమ్మకాలు కొనసాగించాయి. బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ, ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, ఎనర్జీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ఐటి, టెక్నాలజీ కంపెనీల షేర్లకు మాత్రమే కొద్ది స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here