స్టంప్‌ తగిలి ఫీల్డర్‌ మృతి

0
33

మైదానంలో ఓ బ్యాట్స్‌మన్‌ ఆవేశం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను బౌల్డ్‌ కావడాన్ని తట్టుకోలేని ఆటగాడు స్టంప్‌ను గాల్లోకి విసిరేయడంతో అది తలకు బలంగా తాకి మరో ప్లేయర్‌ మైదానం లోనే కన్నుమూశాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. చిట్టగాంగ్‌లో జరిగిన స్థానిక మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ స్టంపౌట్‌ కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో స్టంప్‌ను గాల్లోకి విసరడంతో వికెట్లకు దగ్గర్లో ఫీల్డింగ్‌ చేస్తున్న 14 ఏళ్ల ఫైసల్‌ హుస్సేన్‌ అనే కుర్రాడి మెడ, తల భాగం మధ్య బలంగా తాకడంతో అతను గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అతను అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here