స్కామ్‌లను ఓడించండి

0
20

ఉత్తరప్రదేశ్‌లో అవినీతిమయమైన పార్టీలను ఓడించాలని, బీజేపీని గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్లలో మొదటి అక్షరాలను సంక్షిప్తీకరిస్తూ ఆయన.. స్కామ్‌ల బంధనాల నుంచి యూపీ ప్రజలు విముక్తులు కావాలని వ్యాఖ్యానించారు. నిత్యం కొట్లాడుకునే ఎస్పీ, కాంగ్రెస్ ఇప్పుడు తమను ఓడించేందుకు ఏకం కావడం ఏమిటని ప్రశ్నించారు. శనివారం యూపీలోని మీరట్‌లో ర్యాలీలో మోదీ మాట్లాడారు. టికెట్లను అమ్మి గదుల్లో డబ్బు దాచుకున్నవారు (పెద్ద నోట్ల రద్దుతో) ఆ సొమ్మునంతా కోల్పోయారని బీఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీ పోతేనే అచ్ఛేదిన్
బదాయూన్: ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలను తుడిచిపెడితేనే ఉత్తరప్రదేశ్‌లో మంచిరోజులు వస్తాయని శనివారం యూపీలోని బిసౌలీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here