సౌలత్‌లు పెరుగడంతో అందరి చూపు సర్కార్ దవాఖానల వైపు పడుతున్నది

0
18

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లాస్థాయి దవాఖానల వరకు పకడ్బందీగా పటిష్ఠపరుస్తున్న విషయం తెలిసిందే. దశలవారీగా దవాఖానల్లో సకల సౌకర్యాలను సమకూరుస్తూ వైద్యసిబ్బంది పనితీరులో కూడా మార్పు తీసుకువస్తుండడంతో రోగులు సర్కార్ దవాఖానల వైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ప్రసవాల విషయంలో ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యశాలలే అత్యుత్తమమని అంటూ క్యూ కడుతున్నారు. కార్పొరేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవానికి రూ.20 వేల నుంచి 50 వేల వరకు, సిజేరియన్ ప్రసవానికి రూ.లక్ష నుంచి రెండులక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇది కేవలం వైద్యుల ఫీజు, మందుల ఖర్చు మాత్రమే. రోగి, వారి సహాయకుల భోజనం, అల్పహారం తదితర ఖర్చులు అదనం. అంతే కాకుండా రోగి వద్ద ఒక్కరికే అనుమతి.

LEAVE A REPLY