సౌర విద్యుత్‌లో దేశంలో రెండోస్థానం

0
88

సౌర విద్యుత్ రంగంలో రాష్ట్రం చేసిన కృషికి గుర్తింపుగా మూడు అవార్డులు దక్కాయి. గ్రిడ్‌కు అనుసంధానం చేయకుండా వ్యక్తిగతంగా సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుకోవడంలో దేశం మొత్తంమీద కేరళ తొలిస్థానంలో నిలువగా తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. ఇక జాతీయస్థాయిలో జిల్లాల పనితీరులో తొలి రెండు స్థానాలూ తెలంగాణకే లభించడం విశేషం. గరిష్ఠంగా 676 వ్యక్తిగత సౌర విద్యుత్ ప్లాంట్లతో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో, 355 ప్లాంట్లతో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. కేంద్ర సంప్రదాయేతర ఇం ధన వనరుల మంత్రిత్వశాఖ ఈ మూడు అవార్డులను ఢిల్లీలో మంగళవారం ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏ సుధాకర్‌రావు, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రాలు రాష్ట్రస్థాయి అవార్డును అందుకోగా, జిల్లా స్థాయి అవార్డులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హోరికెళి అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here