సౌదీ, ఇజ్రాయెల్, వాటికన్, ఇటలీ, బ్రస్సెల్స్‌లలో పర్యటన

0
20

ప్రపంచ దేశాలతో మరుగునపడ్డ సంబంధాలను పునరుద్ధరించడంతోపాటు కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో ఐదు దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. సౌదీ, ఇజ్రాయెల్, వాటికన్‌సిటీ, ఇటలీ, బ్రస్సెల్స్ దేశాల్లో పర్యటించి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ పర్యటనలో భాగంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ముస్లిం నాయకులతో చర్చించనున్నారు. ట్రంప్ పర్యటన తేదీలను ఇంకా ప్రకటించలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సౌదీ అరేబియా పాలకులు తాము అమెరికాతో సరికొత్త సంబంధాలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌నకు సందేశమిచ్చారు. అందులో భాగంగా తన తొలి విదేశీ పర్యటనను సౌదీ అరేబియాతో ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రంప్ సౌదీ పర్యటనకు వెళ్తే ఒక అమెరికా అధ్యక్షుడు తన తొలి విదేశీ పర్యటనను ఆ దేశంతో ప్రారంభించడం ఇదే తొలిసారి అవుతుంది.

LEAVE A REPLY