సౌందర్యంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది ఢిల్లీ సొగసరి శ్రియ.

0
53

మూడుపదుల వయసు దాటిగా వన్నె తరగని సౌందర్యంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది ఢిల్లీ సొగసరి శ్రియ. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో విరామ సమయాన్ని విదేశాల్లో గడుపుతున్నది. ఈ మధ్యే మాల్దీవ్స్‌కు వెళ్లిన ఈ అమ్మడు అక్కడి సముద్రంలో ప్రమాదకరమైన షార్క్ చేపలతో కలిసి ఈత కొట్టిందట. ఈ సాహసం గురించి చెబుతూ నా జీవితంలో ఉద్విగ్నభరితమైన క్షణాలవి. సముద్రంలో షార్క్‌లతో కలిసి ఈత కొట్టడం గొప్ప అనుభూతినిచ్చింది. సముద్రపు అందాల్ని ఆస్వాదిస్తూ పడవలో గడిపిన సమయం మరచిపోలేనిది. ఆ ప్రదేశం నుంచి వెనక్కి రావాలనిపించలేదు. అక్కడే శాశ్వతంగా వుండిపోవాలనిపించింది అని పేర్కొంది. సాధారణంగా షార్క్‌లను చూస్తేనే భయపడిపోతారు. అలాంటిది శ్రియ వాటి మధ్య ఈత కొట్టడం నిజంగా సాహసమేనని అంటున్నారు. ప్రస్తుతం హిందీలో ఒక చిత్రంలో నటిస్తున్నది శ్రియ. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చర్చల దశలో వున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here