సోషల్ మీడియలో మళ్లీ జోరు

0
10

దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్‌లో బిజీగా గడిపిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియలో మళ్లీ జోరు పెంచాడు. కొద్ది రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక విషయంపై వరుస పెట్టి సరదా ట్వీట్లు చేస్తున్నాడు. కాస్త హాస్యం జోడించి సెహ్వాగ్ చేసే ట్వీట్‌లు ఆసక్తికరంగా, వ్యంగంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. తాజాగా కనువిప్పు కలిగించే ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న రోడ్డు దాటేందుకు ఓ అంధురాలు ఫుట్‌పాత్ అంచున నిలబడింది. వాహనాలు ఆగకపోతాయా రోడ్డు దాటలేకపోతానా అని కొద్దిసేపు వేచిచూసింది. అవకాశం వచ్చినప్పుడల్లా రహదారి దాటేందుకు రెండు అడుగులు ముందుకు వేయడం, ఏదో ఒక వాహనం రావడంతో మళ్లీ వెనక్కి వేయడం చేస్తోంది. ఇలా పలుమార్లు ప్రయత్నించింది. చివరికి అక్కడున్న ఒక కోతి వచ్చి ఆమె చేతిలో ఉన్న కర్రను పట్టుకొని ట్రాఫిక్ తక్కువ కాగానే రోడ్డు అవతలికి ఆమెను తీసుకెళ్లింది. ఆమెను సురక్షితంగా రోడ్డు దాటించిన తరువాత కోతి మళ్లీ తన స్థానానికి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడున్న వారంతా చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతి ఒక్కరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు. కానీ, ప్రతిఒక్కరూ కొంత మందికైనా సాయం చేయొచ్చు అని పేర్కొంటూ ఆ వీడియోను సెహ్వాగ్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here