‘సోక్కాలి మైనర్‌’గా వస్తున్న నాగార్జున

0
14
తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు నాగార్జున. ఇటీవల ‘తోళా’ సినిమాతో తమిళ తంబిలను మరింత ఆకట్టుకున్నారు. రొటీన్‌కు భిన్నమైన నటనతో ఇక్కడ కూడా కార్తితో కలసి హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ఇటీవల తెలుగులో నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం తమిళంలో ‘సోక్కాలి మైనర్‌’గా అనువాదమవుతోంది. ఇందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌ తదితరులు నటించారు. ప్రస్తుతం అనువాదం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మాటలను మలుస్తున్నారు. పంచెకట్టుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున ఫిబ్రవరిలో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి రానున్నారు.

LEAVE A REPLY