సొంత పార్టీ పెట్టిన శశికళ సోదరుడు

0
28

2016 డిసెంబరులో జయలలిత మరణం, ఆమె స్నేహితురాలైన శశికళ జైలుకెళ్లడంతో తమిళ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోవడం, ఆ తర్వాత తిరిగి కలిసిపోవడం జరిగాయి. ఈ క్రమంలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి దూరం పెట్టారు. దీంతో దినకరన్‌ సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీకి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పేరు పెట్టారు.

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా శశికళ, ఆమె సోదరుడు దివాకరన్‌ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దివాకరన్‌ తన పేరును వాడుకుంటున్నారని శశికళ ఆయనకు లీగల్‌ నోటీసులు పంపింది. దీంతో ఈ వివాదం కాస్త ముదిరింది. శశికళ తీరుపై ఆగ్రహానికి గురైన దివాకరన్‌.. ఇకపై తాను ఆమెను అక్క అని పిలవబోనని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here