సొంతింటి ఆశలపై నీళ్లు!

0
2

ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన (పీఎం జీఎస్‌వై), ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం నీరుగారి పోతోంది. ఇళ్లులేని పేదలకు జీ+3 అపార్ట్‌మెంట్ల రూపంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఇళ్లు మంజూరయ్యాయని ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. తీరా వివిధ కారణాలు చూపుతూ ఇళ్లు రద్దయ్యాయని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతు న్నారు. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ఎంతగానో ఆశపెట్టి చివరకు నిరాశే మిగిల్చారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

LEAVE A REPLY