సైబర్‌వార్‌కు నిపుణులు సిద్ధం

0
18

రాబోయే కాలంలో సైబర్ మోసగాళ్లతో జరిగే ఆన్‌లైన్ యుద్ధం.. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులకంటే ప్రమాదకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణుల అవసరం ఎంతగానో ఉందని అన్నారు. సైబర్ భద్రతకోసం ఇప్పటికే ప్రత్యేక పాలసీ తీసుకువచ్చి ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ దేశాల తో జట్టుకట్టి ముందుకుసాగుతున్నామని తెలిపారు. ప్రత్యేకపాలసీ, టీహబ్ ఆవిష్కరణలతో సైబర్ దాడులను ఎదుర్కొనే నిపుణులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కండ్లకు కనిపించని శత్రువులతో చేసే ప్రమాదకరమైన యుద్ధమే సైబర్ వార్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు విశ్లేషించారు. రాబోయే కాలంలో యుద్ధం అంటే దేశ సరిహద్దుల్లో జరుగదని, సైబర్ మోసగాళ్లను ఎదుర్కొనే ఆన్‌లైన్ యుద్ధం.. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులకంటే ప్రమాదకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటి అవసరం సైబర్ నిపుణులను తయారుచేయడమేనన్న కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 2.0ను మంగళవారం హెచ్‌ఐసీసీలో మంత్రి కేటీఆర్, కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్,

LEAVE A REPLY