సైన్యాధిపతి ఎంపికపై దుమారం

0
29

సైన్యంలో సీనియర్‌ను అధిపతిగా ఎంపిక చేసే ప్రక్రియ దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం దీనిని పక్కనబెడుతూ ఇద్దరు సీనియర్లను కాదని ఆర్మీచీఫ్‌గా బిపిన్ రావత్‌ను ఎంపిక చేసింది. దీంతో మొదటిసారి ఆర్మీ అధిపతి ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఎంపికపై కాంగ్రెస్, సీపీఐ ఆరోపణలు, బీజేపీ ఎదురుదాడితో దుమారం రేగుతున్నది.
సైన్యం తదుపరి అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై కాంగ్రెస్, సీపీఐ తీవ్ర విమర్శలు గుప్పించాయి. దశాబ్దాలుగా సీనియర్లకు పట్టం కడు తూ వస్తున్న సంప్రదాయాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కనబెట్టడంతో ఆర్మీ చరిత్రలో మొదటిసారిగా వివాదం నెలకొన్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివిధ విభాగాల్లో సీనియర్లను ఉద్దేశపూర్వకంగానే పక్కనబెడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులను ఎంపిక చేస్తూ వివాదం సృష్టిస్తున్నదని ఆరోపించాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ ప్రతిపక్షాలు కావాలనే అన్ని విషయాలను రాజకీయం చేస్తున్నాయని తిప్పికొట్టింది. కాంగ్రెస్ నేత మనీష్‌శర్మ ఆదివారం డిల్లీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వ్యవస్థలతో ఆడుకుంటున్నది. ఆర్మీని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నది. బిపిన్‌రావత్‌ను నియమించడం ద్వారా ఆయన కన్నా సీనియర్లు లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షీ, లెఫ్టినెంట్ జనరల్ పీఎం హరిజ్‌ను పక్కనబెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here