సైన్యంలో వెట్టిచాకిరిపై సోషల్ మీడియాలో సైనికుడి ఆవేదన

0
20

ఇటీవల బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు చేయగా తాజాగా ఆ జాబితాలో సైన్యానికి చెందిన ఓ జవాన్ చేరారు. అధికారులు షూ పాలిష్ చేయించుకుంటున్నారని శుక్రవారం డెహ్రాడూన్‌కు చెందిన 42 ఇన్‌పాంట్రీ బ్రిగేడ్ లాన్స్‌నాయక్ యజ్ఞ ప్రతాప్ సింగ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. సైనికులతో అధికారులు వెట్టి చాకిరి, ఇంటిపనులు చేయించుకుంటున్నారని గతేడాది జూన్‌లో రక్షణశాఖ మంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు లేఖ రాశానని పేర్కొన్నారు. తన లేఖపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) విచారణకు ఆదేశించిందని.. ఎప్పుడైతే పీఎంవో విచారణ మొదలైందో అప్పటినుంచి వేధింపుల పర్వం ఎక్కువైందని, తనను కోర్ట్ మార్షల్ చేశారని వాపోయారు. తాను ప్రధానికి రాసిన లేఖలో ఆర్మీకి సంబంధించిన నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు.

LEAVE A REPLY