సైనా వితరణ

0
20

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ శుక్రవారం తన 27వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకున్నది. ఛత్తీస్‌గఢ్‌లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ. 6 లక్షల విరాళాన్ని ప్రకటించి సైనా సహృదయతను చాటుకుంది. గతవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఈ 12మంది జవాన్ల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున విరాళాన్ని ఇస్తున్నట్లు సైనా ప్రకటించింది. గతవారం జరిగిన ఈ ప్రమాద సంఘటన తనను ఎంతో కలిచివేసిందన్న సైనా, పెద్దదిక్కు కోల్పోయిన ఆ జవాన్ల కుటుంబాలకు ఈ చిన్నిసాయాన్ని చేస్తున్నట్లు తెలిపింది. చత్తీస్‌గఢ్ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను చాలా బాధించింది. మన రక్షణ కోసం వాళ్లు ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. చనిపోయిన వాళ్లను ఎలాగూ తిరిగి తీసుకురాలేం.. అందుకే, వాళ్ల కుటుంబాలకు నాకు చేతనైనంతగా ఈ ఆర్థికసాయాన్ని అందజేస్తున్నాను అని సైనా పేర్కొంది. చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఈ జవాన్లకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ. 1.08 కోట్లు విరాళాన్ని ప్రకటించాడు. 12మంది జవాన్ల కుటుబాలకు రూ. 9 లక్షల చొప్పున అందజేయనున్నట్లు అక్షయ్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here