సైనా ఔట్

0
22

మకావు: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో భారత టాప్‌స్టార్ సైనా నెహ్వాల్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. గత రెండు సూపర్ సిరీస్ టోర్నీల్లో ఘోరంగా విఫలమైన ఈ హైదరాబాదీ తాజాగా మకావు ఓపెన్‌లోనూ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ సైనా 17-21, 17-21తో ప్రపంచ 226వ ర్యాంకర్ జాంగ్ ఇమాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. మోకాలి గాయం నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కోలుకుంటున్న సైనా కోర్టులో చురుకుగా కదల్లేకపోయింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కొట్టిన బలమైన ర్యాలీలకు సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన 19 ఏండ్ల ఇమాన్ 4-2, 9-8 ఆధిక్యంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here