సెహ్వాగ్‌తో గొడవపై ప్రీతి జింతా స్పందన

0
2

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మార్గదర్శి వీరేంద్ర సెహ్వాగ్‌, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింతా మధ్య విభేదాలు తలెత్తాయని దాంతో ఆగ్రహించిన వీరూ పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించినట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇటీవల పంజాబ్‌-రాజస్థాన్‌ మ్యాచ్‌ వేదికగా వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
దీనిపై తాజాగా ప్రీతి సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముంబయి మిర్రర్‌ ఛానెల్‌ మళ్లీ తప్పుగా రాసింది. ఎందుకంటే మా గురించి వార్తలు రాయమని వారికి డబ్బులు ఇవ్వడం లేదు కదా! డబ్బులిస్తేనే వార్తలు సరిగ్గా రాస్తారు. నాకు, వీరూకి మధ్య జరిగిన సంభాషణను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు నేను విలన్‌ అయిపోయానా?. ఫేక్‌ న్యూస్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY