సెలవు రోజు రహస్యంగా బ్యాంకులో.. కోటి రూపాయల పాత నోట్ల మార్పిడి

0
24
చామరాజనగర్: రద్దైన పెద్ద నోట్లను భారీగా మార్చుకునేందుకు బడా బాబులు బ్యాంకు సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. ఓ పక్క సామాన్యులు ఇబ్బంది పడుతుంటే కోటీశ్వర్లు మాత్రం కోట్లలో కొత్త నోట్లు పొంది తమ పబ్బం గడుపుతున్నారు. కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌ క్యాషియర్ పరశివమూర్తి కమిషన్ కోసం కక్కుర్తిపడ్డాడు.
 ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు బ్యాంకులో ప్రవేశించాడు. కోటి విలువైన పాత నోట్లను ఓ వ్యక్తికి కొత్త వాటికి మార్పిడి చేశాడు. అయితే బ్యాంకులోని నగదు, రసీదుల మధ్య భారీగా తేడా ఉండటంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీంతో పరశివమూర్తి బండారం బయటపడటంతో సోమవారం అతడ్ని సస్పెండ్ చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY