సెమీస్‌లో భారత్!

0
9

అంధుల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు గెలుపు జోరు కొనసాగుతూనే ఉన్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమ్‌ఇండియా సెమీఫైనల్ అవకాశాలను దాదాపు ఖరారు చేసుకున్నది. ఆదివారం ఆ స్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 128 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిం ది. దీంతో ఇప్పటివరకు ఆడిన 7మ్యాచ్‌ల్లో 6విజయాలు ఖాతాలో వేసుకున్న టీమ్‌ఇండియా.. 18 పాయింట్లతో టాప్‌లో దూసుకెళుతున్నది. తర్వాత స్థానాల్లో దాయాది పాకిస్థాన్(15), బంగ్లాదేశ్(15) ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 273 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్ 18.3 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. అజయ్‌కుమార్ (2/11), ఇక్బాల్ జాఫర్(1/20), ప్రేమ్‌కుమార్(1/14) ఆసీస్‌ను స్వల్పస్కోరుకే కట్టడిచేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో 40 పరుగులు ఆసీస్ ఖాతాలోకి చేరడం విశేషం. అంతకుముందు ఓపెనర్ సునీల్(72 బంతుల్లో 163నాటౌట్) సెంచరీకి తోడు మహ్మ ద్ ఫర్హాన్(53 రిటైర్డ్ హర్ట్) ప్రదర్శన తోడవడంతో భారత్ 20ఓవర్లలో 272 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఆసీస్ బౌలర్లను చెండాడుతూ సునీల్ బ్యాటింగ్ కొనసాగింది. మిగతా మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్, నేపాల్‌పై శ్రీలంక, న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ విజయాలు సాధించాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం న్యూజిలాండ్‌తో ఆడనుంది.

LEAVE A REPLY