సెన్సేషన్‌: 67 బంతుల్లో డబుల్‌ సెంచరీ

0
11

టి20 మ్యాచ్‌లో సరికొత్త రికార్డు. పొట్టి ఫార్మాట్‌లో తొలిసారిగా డబుల్‌ సెంచరీ నమోదయింది. ముంబైకి చెందిన రిజ్వీ కాలేజీ బ్యాట్స్‌మన్‌ రుద్ర ధండే(19) ఈ ఘనత సాధించాడు. 67 బంతుల్లోనే ద్విశతకం బాది చరిత్ర సృష్టించాడు.
ముంబై యూనివర్సిటీ అంతర కాలేజీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం మాతుంగ జింఖానా మైదానంలో రిజ్వీ, పి. దాల్మియా కాలేజీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘రుద్ర’తాండవం చేశాడు. రిజ్వీ కాలేజీ టీమ్‌ తరపున బరిలోకి దిగిన దండే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 67 బంతుల్లో 21 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో డబుల్‌ సెంచరీ చేసి అరుదైన రికార్డు సాధించాడు. రుద్ర విజృంభణతో రిజ్వీ టీమ్‌ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 322 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దాల్మియా జట్టు 10.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. 247 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

LEAVE A REPLY