సెన్సెక్స్ @ 39,000!

0
24

వచ్చే ఏడాదిలో ఈక్విటీలు రెండంకెల (15 శాతం) రిటర్నులు పంచవచ్చని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక అంచనా వేస్తున్నది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కనిష్ఠ రిటర్నుల వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నది. కానీ వచ్చే ఏడాది పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. షేర్ల విలువ సముచిత స్థాయిలో ఉండటం, పెద్ద నోట్ల రద్దు కారణంగా వృద్ధి మళ్లీ కనిష్ఠానికి పడిపోయే అవకాశం, గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానితమై ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నది. నోట్ల రద్దు జీడీపీకి ప్రతికూలం కానుంది. ఈ పరిణామ ఫలితంగా కార్పొరేట్ సంస్థల ఆదాయం, పునరుద్ధరణ మరింత జాప్యం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈక్విటీలు ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయని, వచ్చే ఏడాదిలో ఈక్విటీ రిటర్నులు రెండంకెల స్థాయిలో ఉండొచ్చు అని అధ్యయన నివేదికలో పేర్కొంది. 2017లో ఈక్విటీ మార్కెట్ దేశీయ కరెన్సీ రూపంలో 15 శాతం రిటర్నులు పంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో సెన్సెక్స్ 30,000 పాయింట్ల మైలురాయికి చేరుకునేందుకు 50 శాతం అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ అంటున్నది. చాలాకాలంపాటు బుల్‌ట్రెండ్ కొనసాగిన పక్షంలో సూచీ 39,000 స్థాయికి చేరుకోవచ్చని, ఇందుకు 30 శాతం చాన్స్ ఉందని రిపోర్టులో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here