సెన్సార్ తిరస్కరణపై సమరం

0
26

ఇటీవల కాలం సెన్సార్ బోర్డ్ తీరు వివాదాస్పదమవుతోంది. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన పలు చిత్రాల విషయంలో సెన్సార్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ లోనూ సెన్సార్ బోర్డ్ తీరు వివాదాస్పదం కాగా.. తాజాగా చిన్న సినిమాగా తెరకెక్కిన ఓ తెలుగు సినిమా యూనిట్ ఏకంగా సెన్సార్ బోర్డ్‌పై యుద్ధం ప్రకటించింది.

రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్‌పై పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ సెన్సార్ బోర్డ్‌ను ఆశ్రయించిన చిత్రయూనిట్ తమ సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని కేవలం యువతను ఆలోచింప చేసేదిగా చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.

‘అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టించే సినిమాలకు క్లీన్ సర్టిఫికెట్స్ జారీ చేసే సెన్సార్ బోర్డ్.. యువతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్టైనర్గా.. రూపొందించిన తమ శరణం గచ్ఛామి సినిమాను అడ్డుకోవడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంద’ని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్.  సహేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ సినిమాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here