సెట్విన్‌ బస్సులో మంటలు..

0
30

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద సెట్విన్ మినీ బస్సులో మంటలు వ్యాపించాయి. బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌.. బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుండి జాహంగీర్ పీర్ దర్గకు వేళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మంటలార్పడంలో ప్రయాణికులు సహకరించారు.

LEAVE A REPLY