సెక్స్ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజీనామా

0
31

సాయం అడగటానికి వచ్చిన మహిళను లైంగికంగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై కర్ణాటక ఎక్సైజ్‌మంత్రి హెచ్‌వై మేతి బుధవారం రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదించటమేగాక, జరిగిన ఘటనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. మంత్రి రాజీనామాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించానని, వీలైనంత త్వరగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ సీఐడీని ఆదేశించానని సిద్దరామయ్య బుధవారం విలేకర్లకు వెల్లడించారు. మంత్రి మేతి స్పందన గురించి తెలియజేస్తూ… ఇదంతా కుట్ర అని మేతి ఆరోపిస్తున్నారు. సదరు ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు అని పేర్కొన్నారు. మంత్రిని కాపాడటానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను విలేకరులు ప్రస్తావించినప్పుడు… ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, సదరు ఘటన గురిం చి తనకు ముందుగానే తెలిసిఉంటే తక్షణం చర్యలను తీసుకునేవాడినని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here