సూరీ సేన వీరోచిత పోరాటం

0
23

ఇటీవల ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన లక్షిత దాడులకు నాయకత్వం వహించిన మేజర్ రోహిత్‌సూరి తన కర్తవ్యాన్ని విజయవంతంగా నెరవేర్చారని ఆర్మీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. నలుగురు ఉగ్రవాదులతో పోటాపోటీ ఢీకొని హతమార్చారని తెలిపారు. మేజర్ సూరికి శాంతికాలపు రెండో అత్యున్నత పురస్కారం కీర్తి చక్రను గణతంత్రదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాల్గొ న్న మిగిలిన 21 మంది సైనికులకూ సైనిక పతకాలు దక్కాయి. సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే బాధ్యతలను సూరి, ఆయన బృందానికి అప్పగించగా, ఆయన పూర్తి వివరాలు సేకరించి.. టార్గెట్లు ఎంపిక చేశారని, అత్యంత రహస్యంగా నిర్వహించిన లక్షిత దాడులను విజయవంతం చేశారని ఆర్మీ తెలిపింది. ఆక్రమిత కశ్మీర్‌లో గత ఏడాది సెప్టెంబర్ 29న అర్ధరాత్రి భారత ఆర్మీ లక్షితదాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల వివరాలను ఆర్మీ ఇన్నాళ్లు రహస్యంగా ఉంచింది. ఇప్పుడు ఆ ఆపరేషన్‌పై కొన్ని వివరాలను ఆర్మీ వర్గాలు బయటపెట్టాయి. దాడులకు దిగిన బృందా లు.. ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి ఏ పాయింట్ వద్ద కలుసుకోవాలో ముందే నిర్ణయించుకున్నారని వెల్లడించాయి. తొలుత ఒక కమాం డ్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న సైనికులు తర్వాత బృందాలుగా విడిపోయారు. ఒక బృందం ఉగ్రవాదులు తప్పించుకుపోవడానికి అవకాశం ఉన్న మార్గాలను ధ్వంసం చేయగా.. మరో గ్రూపు రాకెట్ ప్రొపెల్ల్‌డ్ గ్రెనేడ్లు, అసాల్ట్ రైఫిళ్లు, మోర్టార్లు, మిస్సైళ్లు ఉపయోగించి కాల్పులు జరిపేందుకు ఫైర్‌బేస్‌ను ఏర్పాటు చేసింది. ఒక బృందం దాడుల్లో ఉండగా, మరో బృం దం వారికి బ్యాకప్‌గా వ్యవహరించింది. దాడులకు నాయకత్వం వహించిన మేజర్.. నిశ్శబ్దంగా శత్రు శిబిరాల్లోని సెంట్రీలను హతమార్చి.. ఆ పై ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారని పేర్కొన్నాయి. మేజర్ నాయకత్వంలోని బృందం పదిమందిని హతమార్చిందని వెల్లడించాయి. అనంతరం ఫైర్‌బేస్ బృందం జరిపిన బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here