సూపర్ చిత్రంలో బ్రహ్మానందం

0
25

లాస్ ఏంజెలెస్: సూపర్ చిత్రంలో బ్రహ్మానందం, ఆలీ మధ్య లై డిటెక్టర్ సీన్లు ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. విచారణ లో భాగంగా కంప్యూటర్ ముం దు కూర్చున్న ఆలీ తప్పు చెప్పగానే ఓ వింత శబ్దం చేయడం, ఆ తర్వాత పోలీస్‌ఆఫీసర్ బ్రహ్మానందం అతడ్ని ఎడాపెడా వాయించడం కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.
సరిగ్గా అలాంటి సాంకేతిక వ్యవస్థను అమెరికాలోని శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు లేదా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల మనసులోని భావాలను ఈ కంప్యూటర్ పసిగడుతుంది. ఈ సాంకేతిక వ్యవస్థకు ఆటోమేటెడ్ వర్చువల్ ఏజెంట్ ఫర్ ట్రూత్ అస్సెస్‌మెంట్స్ ఇన్ రియల్ టైమ్ (అవతార్) అని పేరుపెట్టారు. ప్రస్తుతం కెనడాలోకి ప్రవేశించే ప్రయాణికుల ఉద్దేశాలను, మనోభావాలను తెలుసుకోవడం కోసం అవతార్ టెక్నాలజీని ఆ దేశ భద్రతా సిబ్బంది పరీక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here