సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై

0
28

సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన పరాస్‌జైన్ తొలిసారి సోలో నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విష్ణు విశాల్‌, నిక్కీ గల్రానీ జంటగా నటించిన తమిళ చిత్రం ‘వెళ్లైకారన’ను, ‘ప్రేమలీల – పెళ్లిగోల’ పేరుతో శ్రీ మహావీర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై అనువదిస్తున్నారు. ఎళిల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘జర్నీ’ ఫేమ్‌ సత్య సంగీతాన్ని అందించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో దర్శకుడు వి.వి.వినాయక్‌ బిగ్‌ సీడీని, నిర్మాత ఆర్‌.బి.చౌదరి సీడీలను ఆవిష్కరించారు. ఆద్యంతం కామెడీగా సాగే ఈ చిత్రం పెద్ద హిట్‌ కావాలని ఆర్‌.బి.చౌదరి అన్నారు. చిత్ర నిర్మాత పరాస్‌జైన్ మాట్లాడుతూ ‘‘తమిళ్‌లో చక్కటి విజయాన్ని మూటగట్టుకుంది. రీమేక్‌ చేస్తే కామెడీ పండదేమోననే ఉద్దేశంతో అనువాదం చేశాం. శ్రీరామకృష్ణ మాటలు, వనమాలి పాటలు, సత్య సంగీతం హైలైట్‌ అవుతాయి’’ అని చెప్పారు. సినిమా పెద్ద హిట్‌ కావాలని నిర్మాతలు అచ్చిరెడ్డి, జెమిని కిరణ్‌, బెల్లంకొండ సురేశ్, దర్శకులు వినాయక్‌, ఎస్‌.వి.కృషారెడ్డి, ఆదిత్య మ్యూజిక్‌ ఉమేశ్ గుప్తా తదితరులు ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here