సుప్రీంకోర్టులోతెలంగాణ స్పెషల్ లీవ్ పిటిషన్

0
27

కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 పరిధిని తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు మాత్రమే పరిమితం చేస్తూ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణకు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదని, కృష్ణా జలాల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈ తీర్పులో ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఎస్‌ఎల్‌పీలో తెలంగాణ పేర్కొంది. ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు న్యాయం జరుగుతుందని భావించడంలేదని స్పష్టం చేసింది. తెలంగాణ నీటి కష్టాలనుగానీ, సాగుభూమి విస్తీర్ణాన్నిగానీ, పంటల తీరుతెన్నుల గురించిగానీ ట్రిబ్యునల్ ఆలోచించలేదని… ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తి ఈ తీర్పులో ప్రతిఫలించలేదని తెలిపింది. శాస్త్రీయ దృక్పథంతో ట్రిబ్యునల్ వ్యవహరించలేదని పేర్కొంది. తెలంగాణకు న్యాయం చేయాలని పేర్కొంటూ ఎస్‌ఎల్‌పీలో సుప్రీంకోర్టును రాష్ట్రప్రభుత్వం కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here