సీబీఐ విచారణకు లాలూ

0
104

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్‌ కేసులో అవినీతికి పాల్పడినట్టు లాలూ కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే లాలూ, ఆయన తనయుడు తేజస్వి సీబీఐ విచారణకు హాజరయ్యారు.

గత నెల 10, 11 తేదీల్లో వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, ఈ కేసు విచారణలో మరింత వివరాలు రాబట్టేందుకు మరోసారి లాలూను సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రైల్వే హోటళ్ల టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా లాలూ తనవారికి కట్టబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here