సీనియర్ క్రీడా పాత్రికేయులు జె. శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

0
28

ప్రముఖ సీనియర్ క్రీడాపాత్రికేయులు జె. శ్రీనివాస్ హఠాన్మరణం చెందారు. తెలుగు ప్రాతికేయ లోకానికి జెస్సీగా అందరికీ సుపరిచితులైన శ్రీనివాస్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. 55ఏండ్ల శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ మూడున్నర దశాబ్దాలుగా పాత్రికేయలోకానికి ఎనలేని సేవలు చేశారు. అందరితో కలివిడిగా ఉంటూ, మంచితనానికి మారుపేరైన జెస్సీ అనూహ్యమృతితో పాత్రికేయ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

LEAVE A REPLY