సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్

0
11

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రేపటి నుంచి ఏప్రిల్ 11వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. చైత్రశుద్ధ పాఢ్యమి నూతన హేవళంబినామ సంవత్సరాది రోజున వేడుకలను ప్రారంభించనున్నారు. ఉగాదిరోజు పంచాంగ శ్రవణం, తిరువీధిసేవ జరుపుతారు. ఏప్రిల్ 1న ఉత్సవాలకు అంకురారోపణ, 2న ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాదివాసం, తిరువీధిసేవ నిర్వహిస్తారు. 3న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 4న స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం, 5న మిథిలా ప్రాంగణంలో శ్రీసీతారాముల కల్యాణమహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. 6న శ్రీరామ పట్టాభిషేకం, 7న సర్వఏకాదశి పూజలు, 8న తెప్పోత్సవం, చోరోత్సవం, 9న ఊంజల్ ఉత్సవం, 10న వసంతోత్సవం, 11న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

LEAVE A REPLY