సీజే అభిశంసనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్

0
2

భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్లను ఉపసంహరించుకుంది. జస్టిస్ దీపక్ మిశ్రా పై కాంగ్రెస్ సహా ఏడు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చిన విషయం విదితమే. ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు (ప్రతాప్ సింగ్ భజ్వా, హర్ష ద్రాయ్ యాజ్నిక్) సుప్రీంకోర్టుకెక్కారు. వీటిపై మంగళవారం పరిశీలన జరుపుతామన్న సుప్రీం.. అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది.

LEAVE A REPLY