సీఎం మెచ్చిన శ్రీజ మరో రికార్డు

0
27

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మెచ్చిన వండర్ కిడ్ లక్ష్మీశ్రీజ మరో రికార్డు సాధించింది. ఆదివారం లాలాపేటలోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ రికార్డ్‌ల ప్రధాన కార్యాలయంలో జ్ఞాపక శక్తికి సంబంధించిన రికార్డు ప్రదర్శన నిర్వహించారు. దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గం నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలోని మంత్రుల పేర్లు, వారి శాఖలను కేవలం 14 నిమిషాల 11 సెకండ్లలో చెప్పి రికార్డ్‌ను కైవసం చేసుకుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ రికార్డ్‌ల పుస్తకం, సూపర్ కిడ్స్‌ల వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి తన కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు.

LEAVE A REPLY