సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది

0
28

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం రోజున రెండు పడకల గదుల ఇండ్లను లాంఛనంగా సీఎం కేసీఆర్ ఉదయం 7.53 గంటలకు ప్రారంభించనున్నారు. ఎర్రవల్లిలోని ఫంక్షన్ హాల్‌లో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 600 మంది బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఆ రోజు రెండు గ్రామాల్లో ఇంటింటా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రెండు పడకల గదుల ఇండ్లు దేశానికే ఆదర్శం కానున్నాయి. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పండుగ సందడి నెలకొన్నది. సామూహిక గృహ ప్రవేశ ఆహ్వాన పత్రికలను గ్రామ అభివృద్ధి కమిటీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు గ్రామంలోనే ఉండి పనులను చేపడుతున్నారు

LEAVE A REPLY