సీఎం చంద్రబాబు గల్ఫ్ పర్యటన రద్దు

0
20

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గల్ఫ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్దా తుపాను హెచ్చరికల నేపథ్యంలో పర్యటన రద్దయిందని చేసుకున్నట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా చంద్రబాబు యూఏఈ, కువైట్‌‌లో పర్యటన చేయాల్సి ఉంది. అండమాన్ నికోబార్ దగ్గర ఏర్పడ్డ వార్దా తుపాను కోస్తా ఆంధ్ర జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వార్దా తుపాను నేపథ్యంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత కలెక్టర్లు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వార్దా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సమీక్షలో ఆయన కలెక్టర్లకు సూచించారు.

LEAVE A REPLY