సీఎం కేసీఆర్ నిర్ణయం

0
22

తెలంగాణ: పట్టణాల్లోని కుల, చేతి వృత్తిదారులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు చర్యలు కొనసాగిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేపల పెంపకంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అనేక అంశాలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మత్స్యకారులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. చేపల పెంపకం కోసం మత్స్యకారులకు 100శాతం సబ్సీడి ఇస్తున్నామన్నారు. నాణ్యమైన చేప పిల్లల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 26.46కోట్లు కేటాయించిందన్నారు

LEAVE A REPLY