‘సీఎంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలం

0
6

సీఎం చంద్రబాబుతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలమయ్యాయని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. 25 శాతం ఫిట్‌మెంట్‌, 3శాతం వెయిటేజ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. పీఆర్సీతో డిస్కమ్‌లపై రూ. 860 కోట్లు అదనపు భారం పడతోందని, విద్యుత్‌ రంగంలో రెండో దశ సంస్కరణలకు సీఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. మండల స్థాయిలో విద్యుత్ నిల్వ ఉంచుకునేలా.. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని కళా వెంకట్రావ్‌ చెప్పారు.

LEAVE A REPLY