సిరివెన్నెల వేటూరి సాహితీ పీఠం పురస్కారం

0
19
Sirivennela Sitarama Sastry at Om 3D Movie Audio Release Photos

రాసిన ప్రతి పాట ప్రజల హృదయాన్ని తాకాలనేదే తన ఆరాటమని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వేటూరి సాహితీ పీఠం సప్తమ పురస్కారాన్ని ఆదివారం సిరివెన్నెలకు అందించారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్‌ విద్యాసంస్థల కల్చరల్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిరివెన్నెల మాట్లాడుతూ వ్యక్తి భావాలను అనుసరించి అతనిని ఆరాధించాలన్నారు. వేటూరి వయసు తన తండ్రి వయసు ఒక్కటేనని, తల్లిదండ్రుల తర్వాత వేటూరినే నాన్నా అని పిలిచేవాడినన్నారు. కాకినాడలో సినిమాలు చూసేటప్పుడు వేటూరి పాటలను విని సాహిత్యంపై మక్కువ పెంచుకున్నానన్నారు. తనకు సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశ్యమే లేదని ఆంధ్రా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరడమే తన లక్ష్యంగా ఉండేదన్నారు. ప్రవృత్తిని వృత్తిగా చేసుకున్నానని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here