సిరియా జంట పేలుళ్లలో 59 మంది మృతి

0
16

షియా వర్గానికి చెందిన యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. మృతుల్లో ఎక్కువగా ఇరాక్ పౌరులు ఉన్నారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. నగరంలో రోడ్డు పక్కన పాతిపెట్టిన బాంబుపై నుంచి బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మరో ఘటనలో ఆత్మాహుతి దళానికి చెందిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ రెండు పేలుళ్లు బాబ్-అల్-సహిర్ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. జంట పేలుళ్లలో 47 మంది యాత్రికులు, 12 మంది సిరియా ప్రభుత్వ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భారీస్థాయిలో ప్రజలు గాయాలపాలయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మొదటి పేలుడు జరిగిన తరువాత అక్కడ గుమిగూడిన ప్రజలే లక్ష్యంగా రెండో పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాజధాని నగరంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బాంబు పేలుళ్లలో ఇదీ ఒకటని భావిస్తున్నారు. డమాస్కస్‌లో అప్పుడప్పుడూ బాంబు పేలుళ్లు సంభవించినప్పటికీ, మిగతా పెద్ద పట్టణాల్లో జరిగినంత విధ్వంసం ఇక్కడ జరుగలేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here