సిరియాపై 50 మిస్సైళ్ల‌తో అమెరికా దాడి

0
22

సిరియాలో ఇవాళ అమెరికా క్షిప‌ణి దాడులు చేసింది. ర‌సాయ‌నిక దాడి ఘ‌ట‌న‌కు ప్రతీకారంగా ప్ర‌భుత్వ బ‌ల‌గాల‌ ప్రాంతాల‌ను టార్గెట్ చేసింది. ఓ సిరియ‌న్ ఎయిర్‌బేస్‌పై సుమారు 50 నుంచి 60 తోమాహాక్ మిస్సైల్స్‌తో అమెరికా ద‌ళాలు దాడి చేసిన‌ట్లు పెంట‌గాన్ అధికారి ఒక‌రు తెలిపారు. మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఉన్న నేవీ డెస్ట్రాయ‌ర్స్ నుంచి ఆ మిస్సైళ్ల‌ను ఫైర్ చేశారు. సిరియా అంతర్యుద్ధంపై ఏదో ఒక‌టి చేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల్లోనే క్షిప‌ణి దాడులు జ‌రిగాయి. మంగ‌ళ‌వారం జ‌రిగిన ర‌సాయనిక దాడిలో సుమారు వంద మంది వ‌ర‌కు మృతిచెంద‌న విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here