సినీ నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన పార్వతమ్మ

0
21

కన్నడ సినీరంగ దిగ్గజం, దివంగత నటుడు రాజ్‌కుమార్ సతీమణి, సినీ నిర్మాత పార్వతమ్మ (77) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మే రెండోవారం నుంచి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య దవాఖానలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కన్నడ సినీరంగానికి తలమానికంగా, కన్నడ కంఠీరవగా పేరొందిన రాజ్‌కుమార్ 2006లోనే కన్నుమూశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులు.. శివరాజ్, రాఘవేంద్ర, పునీత్ సినీరంగంలో ఉన్నారు. పార్వతమ్మ 1953లో రాజ్‌కుమార్‌ను వివాహమాడారు. అనంతరకాలంలో సినీనిర్మాతగా ఆమె పలు సినిమాలను నిర్మించారు. మొత్తం 75 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కన్నడ రాజ్యోత్సవ్, కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన జీవితకాల సాఫల్య పురస్కారాలతోపాటు ఫాల్కే ఎకాడమీ అవార్డును పార్వతమ్మ అందుకున్నారు. నదీజలాల వివాదాలు తలెత్తినప్పుడు కర్ణాటక తరఫున ఆమె గట్టిగా తన గళం వినిపించారు.

LEAVE A REPLY