సినీ నటి రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి యోచన

0
30

సినీ నటి రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి యోచనపై ఆమె చేసిన కామెంట్ వివాదం సృష్టిస్తోంది. ఓ సందర్భంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్య మీద నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మీరు మళ్ళీ వివాహం చేసుకుంటారా ? నిజమా ? అని ఒకరు నమ్మలేనట్టు డౌట్ వ్యక్తం చేస్తే.. ఐ హేట్ యూ ( మిమ్మల్ని ద్వేషిస్తా) అని మరొకరు ఆగ్రహించారు. మరో వీరాభిమాని అయితే మీరు మ్యారేజ్ చేసుకుంటే చచ్చినంత ప్రామిస్ (ఒట్టు) అని పెద్ద ఒట్టే వేశారు. ఇంకొకరు.. మీరు పెళ్లి చేసుకుంటే గౌరవం కోల్పోతారని, ఇటీవల మీరిచ్చిన ఇంటర్వ్యూ చూశానని అంటూ..” ఇది నా హంబుల్ రిక్వెస్ట్.. కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్) వల్లే మిమ్మల్ని అంతా వదినగా భావిస్తున్నారు. నా అభిప్రాయం అర్థమైందనుకుంటా.. ప్లీజ్.. ఆ ఆలోచన విరమించుకోండి. మీ నిర్ణయంతో ప్రతివాళ్ళూ సఫర్ అవుతారు ” అని వాపోయారు. ఈ కామెంట్లన్నింటినీ రేణు దేశాయ్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here